Gandeevadhari Arjuna | మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు దర్శకుడు (Praveen Sattaru). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా మిగిలింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నిమేకర్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ”సెప్టెంబరు 24న వచ్చేది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్ తెచ్చే ధైర్యం కూడా అని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ (X) ప్లాట్ఫామ్లో రాసుకోచ్చింది.
Telugu movie #GandeevadhariArjuna digital arrives September 24 on Netflix.
Starring – Varun Tej, Sakshi Vaidya, Vinay Rai, Vimala Raman, Nasser & Manish Chaudhari. pic.twitter.com/U5mSH2VnI5
— Ott Updates (@Ott_updates) September 20, 2023
కథలోకి వెళితే.. దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్య నుంచి కాపాడటానికి అర్జున్ (వరుణ్‌తేజ్) అనే వ్యక్తి ముందుకొస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? ఇంతకి అర్జున్ చేపట్టిన ఆపరేషన్ వెనకున్న లక్ష్యమేమిటన్నది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమాలో వరుణ్‌తేజ్ స్టెలిష్ లుక్స్‌తో కనిపించారు. ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. యాక్షన్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.