Gandeevadhari Arjuna Movie | ఉత్కంఠ రేకెత్తిస్తున్న గాండీవధారి అర్జున ప్రీ-టీజర్.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్
Gandeevadhari Arjuna Movie Pre-Teaser | ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుని ఎంతో కష్టపడి చేసిన గని.. రెండో రోజు నుంచే సైలెంట్ అవడంతో వరుణ్ తీవ్రంగా నిరాశ పడ్డాడు. ఇక ఈ సినిమా తాలుకూ చేదు జ్ఞాపకాలు మరవకముందే ఎఫ్-3 రూపంలో మెగా ప్రిన్స్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది.
Gandeevadhari Arjuna Movie Pre-Teaser | ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుని ఎంతో కష్టపడి చేసిన గని.. రెండో రోజు నుంచే సైలెంట్ అవడంతో వరుణ్ తీవ్రంగా నిరాశ పడ్డాడు. ఇక ఈ సినిమా తాలుకూ చేదు జ్ఞాపకాలు మరవకముందే ఎఫ్-3 రూపంలో మెగా ప్రిన్స్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇలా రెండు బ్యాక్ బు బ్యాక్ డిజాస్టర్లతో వరుణ్ డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ గాండీవధారి అర్జునపైనే ఉన్నాయి. ప్రచార చిత్రాలు, టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమాపై అటు మెగా అభిమానుల్లో ఇటు సినీ లవర్స్‌లో వీర లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
లెటెస్ట్‌గా రిలీజైన ప్రీ టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సారి ప్రవీణ్ సత్తారు అంతకు మించి అనే రేంజ్లో వస్తున్నట్లు క్లారటీ వచ్చేసింది. వేగంగా వెళ్తున్న కారు.. వెనకాల ఉన్న డిక్కీలో గన్స్.. వాటిలోంచి ఒక మిస్సైల్ లాంటి గన్ తీసుకుని వరుణ్ ప్రత్యర్థులపై దాడి చేయడం.. ప్రీ టీజర్లో టీజర్ తాలుకూ రిఫరెన్స్‌లు పెట్టి విపరీతమైన అటెన్సన్ క్రియేట్ చేశాడు ప్రవీణ్ సత్తారు. ప్రీ టీజరే ఈ రేంజ్లో ఉంటే, టీజర్ ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందోనని మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

