Gandeevadhari Arjuna Movie | బౌండరీలు దాటిన బడ్జెట్.. వామ్మో గాండీవధారి అర్జునకు అన్ని కోట్లు ఖర్చయిందా?
Varun Tej | ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్లు పరిమితులు దాటిపోతున్నాయి. ముందుగా ఒక నెంబర్ ఫిక్స్ అయి షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఆ డిజిట్ రెండింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అనవసరంగా ఖర్చుపెడుతున్నారంటే అదీ కాదు.
Varun Tej | ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్లు పరిమితులు దాటిపోతున్నాయి. ముందుగా ఒక నెంబర్ ఫిక్స్ అయి షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఆ డిజిట్ రెండింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అనవసరంగా ఖర్చుపెడుతున్నారంటే అదీ కాదు. కథ డిమాండ్ చేస్తే తప్పదు. దాంతో బడ్జెట్ అనేది నిర్మాతల కంట్రోల్లో ఉండకుండాపోతుంది. వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ సినిమాకు ముందుగా వేసుకున్న లెక్కలు వేరే. కానీ షెడ్యూల్స్ పూర్తయిన కొద్ది బడ్జెట్ పెరుగుతూ పోయిందట. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.55 కోట్లట.
ఓ అంతే కదా అని కొందరు అనుకుంటడొచ్చు. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ మార్కెట్ రూ.30 కోట్లలోపే. అంటే వరుణ్ మార్కెట్‌కు దాదాపు రెండింతలు సినిమాకు బడ్జెట్ ఎక్కువైంది. ఇక సినిమా కథ కూడా అలాంటిదే. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, విదేశాల్లో షూటింగ్. దాంతో కథ ఖర్చును డిమాండ్ చేసింది. నిర్మాతలు భరించక తప్పలేదు. ఆ మధ్య రిలీజైన టీజర్ చూస్తుంటే వీళ్ల ఖర్చు వర్త్ అనే తెలుస్తుంది. టీజర్ చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కనిపించింది. అవే యాక్షన్ ఎపిసోడ్లు 70ఎమ్ఎమ్ స్క్రీన్‌పై చూస్తే ఆ విజువల్ ఫీలింగే వేరు.
అయితే నాన్-థియేట్రికల్ రూపంలో అప్పుడు నిర్మాతలకు రూ.26 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అంటే మరో ముప్పై కోట్లు థియేటర్ నుంచి రావాల్సి ఉంటుంది. మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై సినీ జనాల్లో మరీ అంత ఎగ్జైట్ అయితే అవ్వట్లేదు. పైగా ప్రమోషన్లు కూడా పూర్‌గా ఉన్నాయి. అసలు చాలా మందికి వచ్చే వారం ఇలాంటి సినిమా ఒకటి విడువుతుందని కూడా తెలియదు. కొండంత టార్గెట్ కళ్లముందున్నప్పుడు కావాల్సిన హైప్ క్రియేట్ చేయాలంటే ఓ రేంజ్లో ప్రమోషన్లు ప్లాన్ చేయాలి. పైగా ఈ సినిమాకు పోటీగా కన్నడ బ్లాక్ బస్టర్ బాయ్స్ హాస్టల్ రిలీజవుతుంది.
నిన్న రిలీజైన ట్రైలర్‌కు యూత్ నుంచి మాములు రెస్పాన్స్ రావట్లేదు. ఆల్రెడీ ఈ సినిమా కన్నడలో బంపర్ హిట్. ఇక ఇక్కడి జనాలకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయితే కాంతారలాగా దీన్ని ఆపడం కష్టమే. ఇదే అనుకుంటే ఆ మరుసటి వారం ఖుషీ రిలీజవుతుంది. రిలీజ్‌కింకా రెండు వారాలు కూడా లేని ఈ సినిమాపై మాములు అంచనాల్లేవు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తిరుగులేని పాజిటీవిటి ఉంది. మరీ గాండీవధారి వీటికి గట్టి పోటినిస్తుందా లేదా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

