Game Changer Trailer | రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
Game Changer | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మూవీ ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా.. జనవరి 01న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Game Changer | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మూవీ ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా.. జనవరి 01న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. అయితే ఈ కటౌట్ లాంఛ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు దిల్ రాజు. ఈ సందర్భంగానే మూవీ ట్రైలర్ జనవరి 01న రాబోతుంది వెయిట్ చేయండి అంటూ చెప్పుకోచ్చాడు.
Game Changer trailer is going to release on January 1st 2025🥵🔥#GameChangerBiggestCutout #GameChanger #RamCharan @AlwaysRamCharan pic.twitter.com/D3k20No1ds
— 𝐒𝐚𝐭𝐲𝐚 (@AlwaysSadwik) December 29, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

