2014 – 2023 చిత్రాలకు గద్దర్ అవార్డులు
2024వ సంవత్సరానికిగాను ఉత్తమ ప్రతిభ కనబరచిన సినీ కళాకారులను గౌరవిస్తూ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
2024వ సంవత్సరానికిగాను ఉత్తమ ప్రతిభ కనబరచిన సినీ కళాకారులను గౌరవిస్తూ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లోని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి శుక్రవారం అవార్డులను ప్రకటించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ అవార్డుల వివరాలను వెల్లడించారు. ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులు ప్రకటించామని, 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ తెలియజేశారు.
సినీరంగానికి ఉత్తమ సేవలు అందించిన వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరు ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా వీటితోపాటే ప్రకటించారు. వాటి వివరాల్లోకెళ్తే.. ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’కు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను, ‘పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు’కు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంను, ‘బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవారు’్డకు దర్శకుడు సుకుమార్‌ను, ‘నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు’కు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావును, ‘కాంతారావు ఫిల్మ్ అవార్డు’కు హీరో విజయ్ దేవరకొండను, ‘రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు’కు యండమూరి వీరేంద్రనాథ్‌ను జ్యూరీ ఎంపిక చేశారు. అలాగే.. ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. జూన్ 14న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాల వివరాలు
2014
ప్రథమ ఉత్తమ చిత్రం : రన్ రాజా రన్
ద్వితీయ ఉత్తమ చిత్రం : పాఠశాల
తృతీయ ఉత్తమ చిత్రం : అల్లుడు శీను
2015
ప్రథమ ఉత్తమ చిత్రం : రుద్రమదేవి
ద్వితీయ ఉత్తమ చిత్రం : కంచె
తృతీయ ఉత్తమ చిత్రం : శ్రీమంతుడు
2016
ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
ద్వితీయ ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
తృతీయ ఉత్తమ చిత్రం:
జనతా గ్యారేజ్
2017
ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
ద్వితీయ ఉత్తమ చిత్రం: ఫిదా
తృతీయ ఉత్తమ చిత్రం: ఘాజీ
2018
ప్రథమ ఉత్తమ చిత్రం : మహానటి
ద్వితీయ ఉత్తమ చిత్రం: రంగస్థలం
తృతీయ ఉత్తమ చిత్రం:
కేరాఫ్ కంచరపాలెం
2019
ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి
ద్వితీయ ఉత్తమ చిత్రం: జెర్సీ
తృతీయ ఉత్తమ చిత్రం: మల్లేశం
2020
ప్రథమ ఉత్తమ చిత్రం:
అల వైకుంఠపురములో..
ద్వితీయ ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో
తృతీయ ఉత్తమ చిత్రం:
మిడిల్ క్లాస్ మెలొడీస్
2021
ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్ ఆర్ ఆర్
ద్వితీయ ఉత్తమ చిత్రం: అఖండ
తృతీయ ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022
ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం
ద్వితీయ ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
తృతీయ ఉత్తమ చిత్రం: మేజర్
2023
ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం
ద్వితీయ ఉత్తమ చిత్రం: హనుమాన్
తృతీయ ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

