Gaayapadda Simham | ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ రివెంజ్.. నవ్వులు పూయిస్తున్న ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్!
Gaayapadda Simham | టాలీవుడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన "గాయపడ్డ సింహం" చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Gaayapadda Simham | టాలీవుడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన “గాయపడ్డ సింహం” చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, అమెరికా వెళ్ళాలని కలలు కనే ఒక యువకుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీల వల్ల వెనక్కి వచ్చి, అతనిపై రివెంజ్ తీర్చుకోవాలనుకునే వినూత్నమైన మరియు హిలేరియస్ పాయింట్‌తో తెరకెక్కింది. తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ డార్క్ హ్యూమర్‌తో ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగా, ట్రైలర్‌లోని డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ మీద రివెంజ్ గురించి హర్షవర్ధన్ చెప్పే సెటైర్లు హైలైట్‌గా నిలిచాయి.
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్ చివరలో శ్రీవిష్ణు కేజీఎఫ్ తరహా ఎలివేషన్‌తో ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. స్వీకార్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మే 1, 2026న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పొలిటికల్ సెటైర్ మరియు యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సందడి చేస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

