Film Piracy | సినిమా అంటే వందలాది మంది కళాకారుల కష్టం, కోట్ల రూపాయల పెట్టుబడి. ఒక చిత్రాన్ని వెండితెరపై చూసి ప్రేక్షకులు పులకించిపోవాలని ప్రతి దర్శకుడు, నిర్మాత కోరుకుంటారు. కానీ గత కొంతకాలంగా పైరసీ మహమ్మారి ఇండియన్ చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెరసీ వెబ్సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేస్తున్న కూడా మళ్లీ కొత్తవి పుట్టుకోస్తున్నాయి. అయితే సినిమా విడుదలవ్వక ముందే పూర్తి స్థాయి హెచ్డి (HD) కాపీలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల దళపతి విజయ్ చిత్రం ‘జన నాయకన్'(Jana Nayagan) విషయంలో జరిగిన లీకేజీ ఈ చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. విడుదల తేదీ కూడా ఖరారు కాకముందే ఈ సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడం అందరినీ షాక్‌కు గురిచేయడమే కాకుండా అందరిని ఆలోచనలో పడేసింది. ఒక అగ్ర హీరో సినిమా పరిస్థితే ఇలా ఉంటే చిన్న సినిమాల పరిస్థితి ఇంకెంతా దారుణంగా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గతంలో తెలుగు పరిశ్రమ కూడా పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోంది. ఇక విడుదలకు ముందే లీక్ అయిన సినిమాలు ఏంటి అనేవి చూసుకుంటే.!
1. అత్తారింటికి దారేది (2013)
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే సగం సినిమా, ఆ తర్వాత దాదాపు పూర్తి సినిమా ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఎడిటింగ్ విభాగంలోని ఒక అసిస్టెంట్ ద్వారా ఈ లీక్ జరిగినట్లు విచారణలో తేలింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ మరియు కంటెంట్ బాగుండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
2. ట్యాక్సీవాలా (2018)
విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం విడుదలకు కొన్ని నెలల ముందే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పూర్తి కాకుండానే ఆన్లైన్లో లీక్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం వాడిన గ్రీన్ స్క్రీన్లు అలాగే కనిపిస్తున్నప్పటికీ జనం ఆ కాపీని చూశారు. దీంతో మేకర్స్ మళ్ళీ వర్క్ చేసి, కొత్తగా చిత్రాన్ని విడుదల చేసి విజయం సాధించారు.
3. గీత గోవిందం (2018)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం కూడా విడుదలకు ముందే లీక్ బారిన పడింది. తొలుత కొన్ని సీన్లు, ఆ తర్వాత దాదాపు పూర్తి సినిమా బయటకొచ్చింది. డిజిటల్ స్క్రీనింగ్ లేదా డిస్ట్రిబ్యూషన్ కాపీల ద్వారా ఇది జరిగి ఉండవచ్చని భావించారు. కానీ యూత్ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకే మొగ్గు చూపడంతో ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది.
4. సికిందర్ (2025)
సల్మాన్ ఖాన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘సికిందర్’ సినిమా కూడా లీక్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు ముందే హెచ్డి వెర్షన్ ఆన్లైన్లో వచ్చిందని, అందులో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం.
5. శంకర్ దాదా MBBS (2004)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం డిజిటల్ యుగానికి ముందే పైరసీ కోరల్లో చిక్కుకుంది. అప్పట్లో సిడి/డివిడిల రూపంలో సినిమాలోని కొన్ని కీలక భాగాలు విడుదలకు ముందే బయటకు వచ్చాయి. అయినా మెగాస్టార్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద పనిచేసి సినిమాను సూపర్ హిట్ చేసింది.
బాహుబలి : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి సినిమా నుంచి కూడా కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందు లీక్ అయ్యాయి అయితే అవి సినిమాను ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేకపోయాయి.
ఇతర భాషా చిత్రాలు
విశ్వరూపం (2013): కమల్ హాసన్ నటించిన ఈ సినిమా తమిళనాడులో వివాదాల వల్ల ఆలస్యమవడంతో పైరేటెడ్ వెర్షన్లు బయటకొచ్చాయి.
ప్రేమమ్ (2015): మలయాళంలో కల్ట్ క్లాసిక్ అయిన ఈ సినిమా క్లైమాక్స్ భాగం విడుదలకు ముందే లీక్ అయ్యింది.
ఉడ్తా పంజాబ్ (2016): సెన్సార్ బోర్డుకు సమర్పించిన కాపీ నుంచి ఈ సినిమా లీక్ అయినట్లు అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, లీకేజీలు కేవలం బయటి వ్యక్తుల ద్వారా కాకుండా సినిమా తయారీ ప్రక్రియలో ఉండే లూప్‌హోల్స్ వల్లే జరుగుతున్నాయి అనేది కొందరి వాదన. ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోల నుంచి కాపీలు తీయడం. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం వేర్వేరు సంస్థలకు డేటాను పంపినప్పుడు భద్రతా లోపాలు తలేత్తడం. సెన్సార్ బోర్డు లేదా డిస్ట్రిబ్యూషన్ కోసం పంపే స్క్రీనర్ కాపీలు దుర్వినియోగం అవ్వడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి చర్యలు మళ్లి పునరవృతం కాకుండా చిత్ర పరిశ్రమ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.