ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ చిత్రాలు
అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా వెలుగులీనే తరుణం ఆసన్నమైంది. ప్రపంచ సినిమాకే తలమానికంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో పోటీపడే చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు సంపాదించుకున్నాయి.
- ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట
అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా వెలుగులీనే తరుణం ఆసన్నమైంది. ప్రపంచ సినిమాకే తలమానికంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో పోటీపడే చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు సంపాదించుకున్నాయి. మొత్తం పది విభాగాలకుగాను నాలుగింటిలో భారతీయ సినిమాలు స్థానం దక్కించుకోవడం విశేషం. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో గుజరాతీ చిత్రం ‘లాస్ట్ ఫిల్మ్‌షో’, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి ‘నాటు నాటు..’ పాట, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీ చర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో స్థానం పొందాయి. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ నిర్వహించబోతున్నారు. దీని ఆధారంగా జనవరి 24న ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాల వివరాల్ని ప్రకటిస్తారు. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వచ్చే ఏడాది మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.
అంతర్జాతీయంగా ‘నాటు నాటు’
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట వివిధ ఇంటర్నేషనల్ నామినేషన్స్‌లో చోటు సంపాదిస్తూ సత్తా చాటుతున్నది. తాజాగా ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌తో పాటు గతంలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో కూడా ఈ పాట నామినేట్ కావడం విశేషం. ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట 14 ఇతర దేశాల గీతాలతో పోటీపడనుంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించగా, కీరవాణి స్వర రచన చేశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

