Atharva | కార్తీక్ రాజు అథర్వ టీంకు ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్లూస్ టీం ప్రశంసలు
Atharva | కార్తీక్ రాజు (KarthikRaju) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అథర్వ’ (Atharva). టాలీవుడ్ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యకు గురైంది. ఆమెతోపాటు సిటీలో మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్ అంటూ సాగే సంభాషణలతో షురూ అయిన ట్రైలర్.. ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు తెలియజేస్తుంది.
Atharva | కార్తీక్ రాజు (KarthikRaju) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అథర్వ’ (Atharva). క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో మహేష్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అథర్వలో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ లోగో, మోషన్‌పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యకు గురైంది. ఆమెతోపాటు సిటీలో మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్ అంటూ సాగే సంభాషణలతో షురూ అయిన ట్రైలర్.. ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు తెలియజేస్తుంది. అతి కిరాతకమైన క్రిమినల్ కేసులను చేధించేందుకు అథర్వ రెడీ అవుతున్నట్టు చెప్పేశాడు డైరెక్టర్.
కాగా అథర్వలో లా ఎన్ఫోర్స్మెంట్లో క్లూస్ టీం ప్రాధాన్యతను తెలియజేయడం పట్ల తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ Dr. Anita Evangelin మేకర్స్ అండ్ టీంకు ధన్యవాదాలు తెలియజేశారు. అథర్వలో క్రైం సీన్ ఆఫీసర్ల పనితీరు, ప్రతిభను ప్రశంసిస్తూ.. వారిని హీరోలుగా చూపించిన తీరుపై అభినందనలు తెలిపారు.
ఈ మూవీని Peggo Entertainments బ్యానర్‌పై నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించి థ్రిల్ ను కలిగించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అథర్వ డిసెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అథర్వ ట్రైలర్..
Brace for impact as the team is ready take you on a thrilling ride!
Presenting you all the theatrical trailer of #Atharva!🔥 – https://t.co/ibV3vs3HUg#AtharvaOnDec1st@Imkarthikraju @SimranCOfficial @dirmaheshreddy @SricharanPakala @SubhashNuthala1 #SBUdhav @TSeries… pic.twitter.com/lYLyQVk14a
— Ramesh Bala (@rameshlaus) November 15, 2023
రింగా రింగా రోజే సాంగ్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

