ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ) ఎన్నికలు సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబందించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్న ఎఫ్ఎన్సీసీ ఎన్నికల్లో సుమారు 1990మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
సెప్టెంబర్ 25న నిర్వహించనున్న ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శి పదవులతో పాటు ఉపాద్యక్షుడు. జాయింట్ సెక్రటరీ, కోశాధికారితో పాటు తొమ్మిది మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.