రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా రూపొందుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు కథానాయిక. మంచాల నాగరాజు దర్శకుడు. మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఒట్టేసుకోనా కోరమీసాలమీనా.. నన్ను కట్టేసుకోనా కాలమంత నీతానా..’ అంటూ సాగే ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా, ప్రశాంత్ ఆర్.విహారి స్వరపరిచారు. శృతి రంజని ఆలపించారు.
పల్లెటూరి మట్టివాసనతో ఈ పాట సాహిత్యం సాగింది. బావపై మరదలి అనురాగాన్ని ఆవిష్కరిస్తూ సింపుల్‌గా, హృదయానికి హత్తుకులా కమల్ ఎస్ల్లావత్ ఈ పాటను రాశారు. మధవ్, దీపాబాలు కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, నిర్మాణం: మోక్ష ఆర్ట్స్.