అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. చాణక్య చిన్నను దర్శకుడిగా పరిచయం చేస్తూ మోనిష్ పత్తిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హీరో అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. అదిత్ అరుణ్ నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: శ్రీనివాస్ తేజ.