Virupaksha | చాలా కాలం తర్వాత మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న టాలీవుడ్ ప్రాజెక్ట్ విరూపాక్ష (Virupaksha). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్నాడు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా రైలు ప్రయాణంలో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్.
సాధారణంగా యంగ్ హీరోలు ఇలాంటి జోనర్‌ను టచ్ చేయాలంటే ఆలోచిస్తారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమేంటని అడుగగా.. సుకుమార్ గారని చెప్పాడు సాయిధరమ్ తేజ్. నాకు హార్రర్ అంటే బాగా భయం.. మీరు కథ పంపిస్తే ఏదైనా లవ్ స్టోరీ అనుకున్నానండి.. హార్రర్ స్టోరీ పంపించారేంటని సుకుమార్ తో అంటే.. ఇది హార్రర్ కాదు మిస్టరీ కింద చూడాలని ఆయన నాతో అన్నారు. 90స్లో జరిగే కథ అంటే కొత్తగా ఉంటుంది. విలేజ్ నేపథ్యంలో చాలా కొత్తగా ఉందనిపించి కథ విన్నా. ఆ తర్వాత ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో మిస్సవకూడదని ఫిక్సయా. సినిమా చూశాక అందరూ పక్కా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టీజర్, టైటిల్ గ్లింప్స్ వీడియో, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కథలో భాగంగా వచ్చే అఘోరా గుహల మేకింగ్ విజువల్స్ వీడియోతో విరూపాక్ష మేకింగ్ విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విరూపాక్ష ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు.
సాయిధరమ్ తేజ్ చిట్‌చాట్ సాగిందిలా..
విరూపాక్ష ప్రపంచంలోకి..
విరూపాక్ష టీజర్..
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..