ముద్దు తెచ్చిన తంటా.. నిర్మాతలకు లీగల్ నోటీసులు
హృతిక్‌రోషన్, దీపిక పదుకొణె జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ఫైటర్' వసూళ్ల సునామీనే సృష్టిస్తోందని చెప్పాలి. ఇప్పటికే 300కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించి దూసుకుపోతోందీ సినిమా. ఇదిలావుంటే..
హృతిక్‌రోషన్, దీపిక పదుకొణె జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ఫైటర్’ వసూళ్ల సునామీనే సృష్టిస్తోందని చెప్పాలి. ఇప్పటికే 300కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించి దూసుకుపోతోందీ సినిమా. ఇదిలావుంటే.. ఈ సినిమాకు అనుకోని వివాదం ఎదురైంది. అస్సాంకు చెందిన ఎయిర్‌ఫోర్స్ అధికారి సౌమ్య దీప్‌దాస్ ఈ సినిమాలోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించారు.
హీరోహీరోయిన్లు అయిన హృతిక్, దీపిక ఇద్దరూ.. ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం ధరించి ఈ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటిచడం అనేది చాలా తప్పు అని, అది గౌరవనీయమైన యూనిఫాంని అవమానించినట్టవుతుందని ఆయన ఆరోపించారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ‘ఫైటర్’ సినిమా సినీ, క్రీడా ప్రముఖుల ప్రశంసలందుకోవడమే కాక, రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంలో ఇలాంటి పరిణామం ఎదురవ్వడం చిత్రబృందానికి ఇబ్బందికర పరిణామమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అంశంపై వారెలా స్పందిస్తారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

