Fight Club Movie OTT | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘జి స్క్వాడ్’ (G Squad ) అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి రీసెంట్గా తన మొదటి సినిమాను కూడా విడుదల చేశాడు. ఫైట్ క్లబ్ (FightClub) అనే పేరుతో ఈ సినిమా రాగా ఈ మూవీకి అబ్బాస్ ఏ రహ్మత్ దర్శకత్వం వహించాడు. ఊరియాడి ఫేం విజయ్ కుమార్ ఇందులో హీరోగా నటించాడు. గతేడాది డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్స్టార్లో ఈ సినిమా ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందించాడు.
And the fight begins 🔥#FightClub #DisneyPlusHotstar #OruTicketNaaluPadam pic.twitter.com/ahw7Yiocna
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) January 27, 2024