ఫిబ్రవరి రెండో వారం సినీ లవర్స్‌కు పండగే.. ఈ వీక్ థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు..!
ఫిబ్రవరి నెలను ఇండస్ట్రీలో డ్రై సీజన్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అప్పట్లో సంక్రాంతి సినిమాల జోరు ఫిబ్రవరి నెల వరకు ఉండేది. పైగా స్టూడెంట్స్‌కు అది ఎగ్జామ్ టైమ్. దాంతో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలంటే దర్శక, నిర్మాతలు కాస్త ఆలోచించేవారు.
February Second Week Theater/Ott Releases | ఫిబ్రవరి నెలను ఇండస్ట్రీలో డ్రై సీజన్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అప్పట్లో సంక్రాంతి సినిమాల జోరు ఫిబ్రవరి నెల వరకు ఉండేది. పైగా స్టూడెంట్స్‌కు అది ఎగ్జామ్ టైమ్. దాంతో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలంటే దర్శక, నిర్మాతలు కాస్త ఆలోచించేవారు. పైగా అప్పట్లో చాలా మంది నిర్మాతలు ఫిబ్రవరిలో లక్ష్మీ కటాక్షం ఉండదని నమ్మేవారట. అయితే అవన్నీ ఒకప్పటి లెక్కలు, ఇప్పుడు కంటెంటే కింగ్. కంటెంట్‌తో వస్తే చాలు నిర్మాతలకు ఆటోమేటిక్‌గా కాసుల వర్షం కురుస్తుంది. అది ఇటీవలే రుజువైంది కూడా. సుహాస్ లాంటి చిన్న హీరో ‘రైటర్ పద్మభూషణ్’తో వచ్చి సంచలన విజయం సాధించాడు. 5రోజుల్లోనే ఆరు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయభేరి మోగించాడు. అదే రోజున విడుదలైన ‘మైఖేల్’, ఆ మరుసటి రోజున రిలీజైన ‘బుట్టబొమ్మ’లు మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకున్నాయి. కథ, కథనంలో పట్టులేకపోవడంతో ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు గాలికి వదిలేసారు. ఇక మొదటి వారంలానే ఈ వారం కూడా ప్రేక్షకులకు విందు భోజనం పెట్టడానికి చాలా సినిమాలు ముస్తాబయ్యాయి. ఈ వారం థియేటర్/ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
అమిగోస్:
ఏడేళ్ల తర్వాత బింబిసారతో తిరుగలేని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం అదే జోరు కొనసాగించేందుకు అమిగోస్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా మైత్రీ సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
వేద:
కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి9న రిలీజ్ కానుంది. గతేడాది డిసెంబర్లో కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ కన్నడలో రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో రానుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
గ్యాంగ్‌లీడర్:
చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్లలో ఒకటైన గ్యాంగ్‌లీడర్ ఫిబ్రవరి 11న రీ-రిలీజ్ కానుంది. విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథకు కమర్షియల్ హంగులను జోడించి బాక్సాఫీస్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు దర్శకుడు బాపినీడు. మళ్లీ అభిమానులతో విజిల్స్ వేయించడానికి థియేటర్లోకి వచ్చేస్తుంది.
టైటానిక్:
ప్రపంచ సినీ చరిత్రలోనే అద్భత ప్రేమకావ్యంగా చెప్పుకునే టైటినిక్ ఫిబ్రవరి 11న రీ-రిలీజ్ కానుంది.ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను టీవీల్లో, ఫోన్లలో చూసుంటాం. అయినా గానీ ఇప్పటికీ టెలికాస్ట్ అవుతుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి ఎవర్గ్రీన్ క్లాసికల్ మూవీ టైటానిక్. విషాదభరిత ప్రేమకథను ఇంత గొప్పగా, పోయేటిక్‌గా జేమ్స్ కామెరూన్ తప్ప ఎవరూ తీయలేరని బల్ల గుద్ది చెప్పొచ్చు. లియోనార్డో డికాప్రియో, కేన్ విన్స్లెట్ కెమెస్ట్రీకి మంత్ర ముగ్ధుడవని ప్రేక్షకుడు లేడు. మళ్లీ వీళ్ళతో ప్రేమలో పడిపోవడానికి టైటానిక్ థియేటర్లలోకి వచ్చేస్తుంది.
వీటితో పాటుగా పాప్-కార్న్, వసంత కోకిల, క్రిస్టోఫర్(మలయాళం) సినిమాలు ఫిబ్రవరి 10న థియేటర్లో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా :
కళ్యాణం కమనీయం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10
అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 2 – ఫిబ్రవరి 10
అమెజాన్ ప్రైమ్ :
ఫర్జీ (తెలుగు వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 10
హంట్ (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
నాట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9
రాజయోగం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 9
హన్సిక లవ్ షాదీ డ్రామా (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10
లెజెండ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10
సన్ ఎన్ఎక్స్టీ:
మహావీర్యార్ (మలయాళ చిత్రం) – ఫిబ్రవరి 10
నెట్‌ఫ్లిక్స్ :
తెగింపు (తెలుగు మూవీ): ఫిబ్రవరి 8
బిల్ రసెల్ (ఇంగ్లీష్ సినిమా) : ఫిబ్రవరి 8
ద ఎక్సేంజ్(అరబిక్ సిరీస్) : ఫిబ్రవరి 8
డియర్ డేవిడ్ (ఇండోనేషియన్ సినిమా) : ఫిబ్రవరి 9
మై డాడ్ ద బౌంటీ హంటర్(ఇంగ్లీష్ సిరీస్): ఫిబ్రవరి 9
యు సిరీస్ సీజన్ 4 పార్ట్1(ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9
10డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్(టర్కిష్ మూవీ): ఫిబ్రవరి 10
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10
లవ్ టూ హేట్ యూ (కొరియన్ సిరీస్) : ఫిబ్రవరి 10
యువర్ ప్లేస్ ఆర్ మై (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10
సోనీ లివ్ :
నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) : ఫిబ్రవరి 10
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

