అదృష్టం కలిసొచ్చేనా?!
దక్షిణాది సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో ముంబయి ముద్దుగుమ్మ కావ్యా థాపర్. మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించిన ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిన్న సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది.
దక్షిణాది సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో ముంబయి ముద్దుగుమ్మ కావ్యా థాపర్. మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించిన ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిన్న సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ‘ఏక్ మినీ కథ’లో సంతోష్ శోభన్ సరసన నటించినప్పటికీ అమ్మడికి కొద్దిపాటి గుర్తింపే వచ్చిందని టాక్. ఎందుకంటే ఆ సినిమా థియేటర్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయింది.
ఆ మధ్య తమిళనాట రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ అక్కడా చెప్పుకోదగ్గ విజయం దక్కలేదనేది సినీ విశ్లేషకుల మాట. అయితే కావ్య ట్రాక్ రికార్డు గురించి లెక్కచేయకుండా ఆమెకు రెండు పేరున్న సినిమాల్లో అవకాశం ఇచ్చారు మేకర్స్. అవే ‘ఈగల్’, ‘ఊరి పేరు భైరవకోన’.
చిత్రమేమిటంటే ఈ రెండు సినిమాలూ ఒకేరోజు విడుదల కానున్నాయి. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ‘ఈగల్’ టీమ్ రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 9కి వాయిదా వేసుకుంది. అంతకన్నా ముందు నుంచే సేమ్ డేట్‌కు ‘ఊరి పేరు భైరవకోన’ షెడ్యూల్ ప్రకటించింది. ఒకే హీరోయిన్ నటిం చిన క్రేజీ సినిమాలు ఒకే రోజు విడుద లవుతుండటం యాదృశ్చికమే. గత ఏడాది సంక్రాంతికి ఒకేరోజు వ్యవధిలో శ్రుతిహాసన్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ విడుదలలై హిట్ కొట్టాయి. ఇప్పుడు ఇదే కోవలో కావ్య నటించిన సినిమాలు వస్తున్నాయి. ఇవి విజయాన్నందుకొని ఆమె కెరీర్‌ను గాడిలో పెడతాయో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

