Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
Fauzi రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ విడుదల కానుందంటూ ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా నిర్మాత మైత్రీ నవీన్ స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ పుట్టినరోజున టీజర్ విడుదల చేయడం లేదని వెల్లడించారు.
Fauzi రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ విడుదల కానుందంటూ ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా నిర్మాత మైత్రీ నవీన్ స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ పుట్టినరోజున టీజర్ విడుదల చేయడం లేదని వెల్లడించారు. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న కావడంతో ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేక అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. ఈ క్రమంలోనే చిత్ర టీజర్‌ను అదే రోజున విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఓ విలేకరి ఇదే విషయాన్ని నిర్మాత మైత్రీ నవీన్‌ను ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ప్రభాస్ పుట్టినరోజున టీజర్‌ను విడుదల చేసే ప్రణాళిక లేదని ఆయన స్పష్టం చేసారు. అయితే అభిమానులను ఉత్సాహపరిచే మరో ఆసక్తికరమైన కంటెంట్‌ను అందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందని తెలిపారు. దీంతో పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతోందనే ఆసక్తి పెరిగింది. అయితే ఆ ప్రత్యేక కంటెంట్ ఏమిటి? ఫస్ట్ లుక్ పోస్టరా, పాత్రకు సంబంధించిన పరిచయ వీడియోనా, మరేదైనా ప్రత్యేక ప్రకటననా? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. చిత్రబృందం అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి గతంలో తెరకెక్కించిన ‘సీతారామం’ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈసారి ప్రభాస్‌తో ఆయన ఎలాంటి కథను చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జే. ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ప్రత్యేక అప్డేట్స్ రావడం అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈసారి ‘ఫౌజీ’ టీజర్ వస్తుందని ఆశించిన వారికి నిర్మాత కామెంట్స్ కొంత నిరాశ కలిగించినప్పటికీ, మరో ప్రత్యేక కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారన్న వార్త ఉత్సాహాన్ని పెంచుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

