ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు .ఇందులో ఫరియా అబ్ధుల్లా కథానాయికగా నటించి అందరి మనసులు గెలుచుకుంది. చిట్టి అనే పాత్రలో తెగ మెప్పించింది. ఈ అమ్మడికి డ్యాన్స్ అంటే చిన్ననాటి నుంచి పిచ్చి… ఇప్పటికే కొన్ని డ్యాన్స్ వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల చీరకట్టులో తీన్మార్ డ్యాన్స్ చేయగా, అది తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంలోని లాలా భీమ్లా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి రచ్చ చేసింది ఫరియా అబ్ధుల్లా. బ్లాక్ డ్రెస్‌లో మాంచి మస్ స్టెప్పులు వేసి అలరించింది ఫరియా.
ఇక ఫరియా సినిమాల విషయాలకి వస్తే ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న ఢీ సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా మరో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ భామ. ఈ కారణంగానే ఆమె క్రేజీ ఆఫర్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఫరియా బాలీవుడ్‌లోనూ ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
https://www.instagram.com/reel/CWNoA2ogHUV/?utm_source=ig_web_copy_link