Faria Abdullah | అది నా పెద్ద తప్పు, ఆ సమయంలో నా మైండ్ పని చేయలేదు.. ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
Faria Abdullah | బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా చిన్న సినిమాగా మొదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ అవకాశాన్ని తానే మిస్ చేసుకున్నానని నటి ఫరియా అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Faria Abdullah | బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా చిన్న సినిమాగా మొదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ అవకాశాన్ని తానే మిస్ చేసుకున్నానని నటి ఫరియా అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.తాజాగా తన కొత్త సినిమా గాయపడ్డ సింహం (మే 1 విడుదల) ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫరియా, తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘జాతిరత్నాలు’ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో కథల ఎంపికపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ‘హనుమాన్’ వంటి మంచి ప్రాజెక్ట్‌ను కోల్పోయానని ఆమె తెలిపింది.
ఆ సమయంలో స్క్రిప్ట్‌లను ఎలా అంచనా వేయాలో తెలియదు. మంచి కథను గుర్తించడంలో తప్పు చేశాను. నిజం చెప్పాలంటే అప్పుడు ఆలోచించకుండా ‘నో’ చెప్పాను. ఇప్పుడు సినిమా రిజల్ట్ చూసాక చాలా బాధగా ఉంది అంటూ ఫరియా తన మనసులోని మాటను బయటపెట్టింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాలను ఎక్కడ కలిసినా ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటానని కూడా తెలిపింది. ఆ సమయంలో నిజంగా నాకు బ్రెయిన్ లేదు. బుద్ధిలేక నో చెప్పాను.. నిజానికి నాకు కథను ఎలా జడ్జ్ చేయాలో తెలియదు. ఇకపై కెరియర్లో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపింది.
ఇక ఫరియా వదులుకున్న ఆ పాత్రను చివరకు అమృత అయ్యర్ దక్కించుకోగా, ఆ సినిమాతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న అవకాశం మరొకరికి వరంగా మారుతుందనే విషయాన్ని ఈ ఉదాహరణ మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ఫరియా తన ఆశలన్నీ ‘గాయపడ్డ సింహం’ సినిమాపైనే పెట్టుకుంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని తన కెరీర్‌కు కొత్త ఊపునివ్వాలని భావిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

