ఇరవై రోజులు అడవిలోనే ఉన్నా!
జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయ గం ఫరియా అబ్దుల్లా. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్' చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకానుంది.
‘జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయ గం ఫరియా అబ్దుల్లా. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా శుక్రవారం ఫరియా అబ్దుల్లా పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…
ఈ సినిమా కథలో మీకు బాగా నచ్చిన అంశాలేమిటి?
ట్రావెలింగ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్గా కనిపిస్తారు. సొంత యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ యాత్రా విశేషాల్ని షేర్ చేస్తుంటారు. ఈ సినిమాలో నేను వసుధ అనే ట్రావెల్ వ్లాగర్‌గా కనిపిస్తా. ప్రయాణ క్రమంలో హీరోని కలుస్తాను. ఆ తర్వాత వారి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ట్రావెల్ నేపథ్య కథ కదా..షూటింగ్ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
అడ్వంచర్స్ నేపథ్యంలో సాగే కామెడీ కథ ఇది. నలభైశాతం వరకు మారేడుమిల్లి, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరిపాం. షూటింగ్ కోసం ఇరవై రోజులు అడవిలోనే ఉన్నా. కథానుగుణంగా యాక్షన్, ఛేజింగ్ సీన్స్ చాలా ఉంటాయి. మొత్తంగా ఈ సినిమా నాకు ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ లాంటి అనుభవాన్నిచ్చింది.
అభిమానులు మిమ్మల్ని ఇప్పటికీ జాతిరత్నాలు సినిమాలోని చిట్టి పేరుతోనే పిలుస్తుండటం ఎలా అనిపిస్తున్నది?
చిట్టి చాలా మందికి ఓ ఎమోషన్‌గా మారిపోయిది. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ను అందరూ ప్రేమించారు. ఓ నటిగా నా ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి కథను ఎంచుకున్నా వందశాతం న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా.
నటిగా భవిష్యత్తులోఎలాంటి లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు?
ఐదేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. ప్రస్తు తం తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆయన నాపై ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ల పాటు నేను ఇండస్ట్రీలో ఉంటానని ఆయన నాతో చెప్పడం సంతోషాన్నిచ్చింది.
కథాంశాల ఎంపికలో మీ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి?
నటిగా ఎలాంటి పరిమితులు విధించుకోలేదు. యాక్షన్, సూపర్‌నేచురల్, సైకో థ్రిల్లర్స్..అన్ని జోనర్స్లో సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’, ఓ తమిళ చిత్రం, హిందీ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

