సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే..రియల్‌లైఫ్‌లో వేలాది మంది చిన్నారుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తూ కోట్లాదిమంది మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). ఆగస్టు 9న ఈ సూపర్ స్టార్ పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో అభిమానులకు పండగే అని చెప్పాలి. తమ ఫేవరేట్ హీరో పుట్టినరోజు (Mahesh birthday) సందర్భంగా ఇప్పటికే పోకిరి (Pokiri special shows) స్పెషల్ షోలకు ప్లాన్ చేశారు అభిమానులు.
బర్త్ డే నేపథ్యంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు. పోకిరి స్పెషల్ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని పేద చిన్నారుల గుండె ఆపరేషన్లు, విద్య కోసం అండగా నిలిచే MB foundationకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. మహేశ్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ గొప్ప ముందడుగు వేయడం ఎంతోమందికి స్పూర్తిదాయకమైన విషయం.
ఇప్పటికే పోకిరి స్పెషల్ షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.