నేను సింగిల్

ప్రస్తుతం తాను ఒంటరినని, ఎవరితో ప్రేమలో లేనని అంటోంది గోవా సొగసరి ఇలియానా. ఏకాంత జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నానని అంటోంది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్తో సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రేమబంధానికి గత ఏడాది వీడ్కోలు పలికింది ఇలియానా. మనస్పర్థల కారణంగా వారు విడిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ ఎడబాటు గురించి ఇలియానా ఇప్పటివరకు పెదవివిప్పలేదు. ప్రేమ, పెళ్లి లాంటి బంధాల పట్ల తన అభిప్రాయాలను గురించి ఇలియానా వెల్లడిస్తూ ‘పందొమ్మిదేళ్ల వయసులో తొలిసారి ప్రేమలోని మాధుర్యామేమిటో తెలుసుకున్నా. అయితే కొద్ది రోజుల్లోనే ఆ ప్రణయబంధానికి అనుకోకుండా ముగింపు పలకాల్సివచ్చింది. ప్రేమంటే నా దృష్టిలో సొంత ఇంట్లో అడుగుపెట్టడం లాంటింది. మనసుకు ఓదార్పుతో పాటు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ ప్రేమకు ముగింపు పడితే ఎంతో వేదనను అనుభవించాల్సివస్తుంది. స్నేహితులు, కుటుంబతోడ్పాటుతో బ్రేకప్ తాలూకు బాధ నుంచి నేను బయటపడగలిగా. వివాహం విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. పెళ్లనేది అందరికీ ఆనందాన్ని ఇవ్వలేదు. నేను పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నా. కానీ అవేవీ ఫలించలేదు’ అంటూ తాత్వికంగా సమాధానమిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

