VD13 | విజయ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్.. ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
Vijay Devarakonda | ఐదేళ్ల కిందట వచ్చిన 'గీతా గోవిందం' సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. పెట్టిన బడ్జెట్‌కు పదింతలు కలెక్ట్ చేసి నిర్మాత పాలిట కామధేనువులా కాసులు వర్షం కురిపించింది.
Vijay Devarakonda | ఐదేళ్ల కిందట వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. పెట్టిన బడ్జెట్‌కు పదింతలు కలెక్ట్ చేసి నిర్మాత పాలిట కామధేనువులా కాసులు వర్షం కురిపించింది. ఇప్పటికీ మీడియా బడ్జెట్ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా ఇదే ఉంది. అంతకు ముందు వచ్చిన ‘అర్జున్ రెడ్డి’లో యాంగర్ మేనేజ్మెంట్ పాత్ర పోషించిన విజయ్.. ఉన్నట్టుండి గీతాగోవిందం కోసం ఇన్నోసెంట్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాదండోయ్.. రష్మిక, విజయ్‌ల కెమిస్ట్రీకు కూడా పట్టం కట్టారు. ఎంతలా అంటే తిరిగి మళ్లీ ‘డియర్ కామ్రేడ్’ కలిసి చేసేంతలా. ఇక ఈ ఒక్క సినిమాతో పరుశురామ్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
ఇక ప్రస్తుతం ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుంది. ఇటివలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. రేపో మాపో షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే పేరును పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక గీత గోవిందం తరహాలోనే హీరో క్యారెక్టర్ బలంగా వుంటూనే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

