Family Star | మిడిల్‌క్లాస్ మధురం.. తప్పకుండా మీ అందర్నీ మెప్పిస్తాం: దిల్‌రాజు
‘కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ విని పదిహేను నిమిషాల్లో ఓకే చెప్పాను. ఇది మధ్యతరగతి కుటుంబాల కథ. మిడిల్‌క్లాస్ భావోద్వేగాలన్నీ విజయ్ పాత్రలో ఉంటాయి.
Family Star | ‘కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ విని పదిహేను నిమిషాల్లో ఓకే చెప్పాను. ఇది మధ్యతరగతి కుటుంబాల కథ. మిడిల్‌క్లాస్ భావోద్వేగాలన్నీ విజయ్ పాత్రలో ఉంటాయి. ప్రతి మధ్యతరగతి వ్యక్తీ తనకుతాను ఐడెంటిఫై చేసుకునేలా ఇందులో విజయ్ పాత్ర ఉంటుంది. ఏప్రిల్ 5న వస్తున్నాం. తప్పకుండా మీ అందర్నీ మెప్పిస్తాం’ అన్నారు దిల్‌రాజు. మధ్యతరగతి భావోద్వేగాలకు వినోదాన్ని మేళవిస్తూ దిల్‌రాజు, శిరీష్‌ల నిర్మాణంలో పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.
బ్లాక్బాస్టర్ ‘గీతగోవిందం’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘మధురము కదా..’ అంటూ సాగే గీతాన్ని హైదరాబాద్ మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో పలు కుటుంబాల సమక్షంలో ఓ వేడుకగా విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ గీతాన్ని గోపీసుందర్ స్వరపరచగా, శ్రేయాఘోషల్ ఆలపించారు. ఇది కుటుంబం గురించి ఆలోచించే కుర్రాడి కథ అనీ, థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేయండని దేవరకొండ విజయ్ చెప్పారు. మృణాల్‌ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

