Priyadarshi | ఫ్యామిలీ సినిమాలు ఎవర్గ్రీన్..
వైవిధ్యమైన కథలతో సినీ ప్రయాణం సాగిస్తున్నారు ప్రియదర్శి. గత ఏడాది ‘బలగం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్‌రామ్ దర్శకుడు. నభానటేష్ కథానాయికగా నటించింది.
Priyadarshi | వైవిధ్యమైన కథలతో సినీ ప్రయాణం సాగిస్తున్నారు ప్రియదర్శి. గత ఏడాది ‘బలగం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకుడు. నభానటేష్ కథానాయికగా నటించింది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రియదర్శి పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
- ప్రస్తుతం కంటెంట్‌కి మంచి రోజులొచ్చాయి. ప్రేక్షకులు కొత్త కథలను, వినూత్న ఆలోచనలను ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ చిత్రాలు ఫ్యామిలీ డ్రామాస్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించాయి.
- ‘డార్లింగ్’ సినిమాలో కథానాయిక పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీతో బాధపడుతుంటుంది. ఈ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. తెరపై హీరోహీరోయిన్లు ఇద్దరూ బాధపడుతుంటే ప్రేక్షకులకేమో నవ్వొస్తుంటుంది. డార్క్ కామెడీలో ఉన్న మ్యాజికే అది. సరికొత్త కాన్సెప్ట్‌తో పాటు దానిని ప్రజెంట్ చేసిన విధానం కూడా విభిన్నంగా అనిపిస్తుంది.
- నభానటేష్‌తో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. మా ఇద్దరి జోడీ చాలా ఫ్రెష్‌గా ఉందని చాలా మంది చెప్పారు. ఈ సినిమా కోసం మేమిద్దరం పదిహేను రోజుల పాటు వర్క్‌షాప్‌లో పాల్గొన్నాం. ఇందులో మా ఇద్దరి క్యారెక్టర్స్ పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో చక్కటి వినోదం పండుతుంది.
- ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిదే కావడం ప్రత్యేకంగా భావిస్తున్నా. ‘హనుమాన్’ రిలీజ్‌కు ముందే ‘డార్లింగ్’ సినిమా కథ ఓకే అయింది. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు.
- ఈ సినిమాలో నేను డ్యాన్సులు కూడా చేశాను. అంత బాగా చేస్తానని నాకే తెలియదు (నవ్వుతూ). దర్శకుడు అశ్విన్‌రామ్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ సహకారంతో మంచి డ్యాన్స్ పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కింది. సంగీత దర్శకుడు వివేక్సాగర్కు 25వ సినిమా ఇది. మేం 25 ఏళ్లుగా మంచి మిత్రులం. ఈ సినిమాకు అద్భుతమైన పాటలిచ్చాడు.
- ఏడాదికి రెండొందల సినిమాలొస్తే అందులో థియేటర్స్‌లో చూసి నవ్వుకునే సినిమాలు పదిలోపే ఉంటాయి. ‘డార్లింగ్’ అదే విధంగా గుర్తిండిపోతుంది. కావాల్సినంత వినోదం, మంచి పాటలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఆకట్టుకుంటుంది. నా తదుపరి చిత్రం ‘35 చిన్న కథ కాదు’ ఆగస్ట్ 15న విడుదలవుతున్నది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతీ మూవీస్‌లో రోషన్‌తో ఓ సినిమా ఉంది. ‘సేవ్ ది టైగర్స్ సీజన్-3’ కూడా చేయాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

