Failure Combinations: తమిళ్ – తెలుగు కాంబినేషన్ సెట్ అవ్వలే.. బిగ్గెస్ట్ డిజాస్టర్లు
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో రకరకాల కాంబినేషన్లు కుదురుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డైరక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులు మాత్రం ఈ కాంబినేషన్లను ఆదరించలేదు.
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో రకరకాల కాంబినేషన్లు కుదురుతున్నాయి. బాహుబలి సినిమా హిట్ తర్వాత తెలుగు సినిమా రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ నేపథ్యంలో తమిళ డైరక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులు మాత్రం ఈ కాంబినేషన్లను ఆదరించలేదు. అలా వచ్చిన కాంబినేషన్లు ఏంటో చూద్దాం..
- నాగచైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్లో వచ్చిన ‘కస్టడీ’ సినిమా నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్య, అరవింద స్వామి, కృతిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.
- తమిళ సీనియర్ డైరెక్టర్ లింగుస్వామి తెలుగు మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ది వారియర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.
- సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ రంజిత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాలో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఈ సినిమా ఆడలేకపోయింది.
- డైరెక్టర్ మురుగదాస్, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ‘స్పైడర్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా మహేష్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో హీరో శర్వానంద్ డెరెక్టర్ శ్రీకార్తిక్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
- విజయ్ దేవరకొండ, డైరెక్టర్ ఆనంద్ శంకర్ కాంబినేషన్లో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘నోటా’ ఘోర పరాజయం చెందింది.
ఈ సినిమాలతో పాటు వెంకటేశ్ వాసు దర్శకత్వంలో వచ్చిన ‘నాగవల్లి’, పవన్ కల్యాణ్ పంజా, కొమరం పులి, బంగారం, హీరో రామ్ సినిమా అయిన ‘గణేష్’, ప్రభాస్ – లారెన్స్ కలయికలో వచ్చిన ‘రెబల్’ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.
ఓ వైపు ఈ కాంబినేషన్లో సినిమాలు విఫలమవుతున్నప్పటికీ త్వరలో మరికొన్ని సినిమాలు రానున్నాయి. వీటిలో భారీ అంచనాలు ఉన్న సినిమా రామ్ చరణ్ – శంకర్ RC – 15. అంతేకాకుండా సముద్రఖని – పవన్ కల్యాణ్ కలయికలో వినోదయం సీతం సినిమా రీమేక్ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

