F3 Collections | గ్లోబల్ బాక్సాపీస్ వద్ద ‘F3’ తాజా కలెక్షన్లు ఇవే..!
వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Kaur) హీరోహీరోయిన్లుగా ఎఫ్3 (F3) చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఇప్పటికే మూడో వారంలోకి ఎంటరైంది ఎఫ్ 3.
టాలీవుడ్ (Tollywood) ఫన్ రైడ్ సినిమా ఎఫ్3 (F3). వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Kaur) హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఇప్పటికే మూడో వారంలోకి ఎంటరైంది ఎఫ్ 3. 17 రోజుల్లో ఈ చిత్రం గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.126 కోట్లు వసూళ్లు చేసినట్టే ట్రేడ్ సర్కిల్ టాక్. ఇది భారీ మొత్తమనే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఎలాంటి లాజిక్స్ కు తావు లేకుండా మరోసారి తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ కూడా ఉండటం..వసూళ్ల పరంగా కలిసొచ్చే విషయమంటున్నారు ట్రేడ్ పండితులు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఎఫ్ 3కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ మూవీలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్, ప్రగతి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

