‘ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సెకండ్‌వేవ్ తర్వాత తొలుత విడుదలైన సినిమా మాదే కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?లేదా? అని భయపడ్డాం. కానీ మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని అన్నారు ఆర్.బి. చౌదరి. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఇష్క్’. తేజా సజ్జా, ప్రియాప్రకాష్వారియర్ జంటగా నటించారు. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. ఎన్వీప్రసాద్, పారస్‌జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తేజా సజ్జా మాట్లాడుతూ ‘బలమైన ఉద్వేగాలతో కూడిన పాత్రను చేయడం ఇదే తొలిసారి. నా నటనను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కొందరు మాత్రం సినిమా నెమ్మదిగా ఉందని, ఫైట్స్, కామెడీ లేదని అంటున్నారు. ప్రయోగాత్మక సినిమా ఇదని కమర్షియల్ హంగులు ఆశించవద్దని మేము ముందే చెప్పాం’ అని చెప్పారు. ‘ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేటర్లోనే విడుదలచేయాలని ఇన్నాళ్లు ఎదురుచూశాం. ఓపెనింగ్స్ బాగున్నాయి. కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ మేము చేసిన ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పించడం ఆనందంగా ఉంది’ అని సమర్పకుడు ఆర్ బి చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం విడుదలైన సినిమాల్లో వసూళ్ల పరంగా మాదే నంబర్‌వన్‌గా నిలుస్తోందని దర్శకుడు ఎస్.ఎస్.రాజు అన్నారు.