Sridevi Soda Center | ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం

‘సుధీర్‌బాబు కెరీర్లోనే అద్భుతమైన నటనను కనబరిచిన చిత్రమిది. చక్కటి హావభావాలను కనబరుస్తూ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయారు’ అని అన్నారు అగ్రనటుడు మహేష్‌బాబు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని ఇటీవల ప్రత్యేకంగా వీక్షించారాయన. సుధీర్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకత్వం వహించారు. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాను వీక్షించిన అనంతరం మహేష్‌బాబు మాట్లాడుతూ ‘మహిళా ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది. సుధీర్‌బాబు, ఆనంది పాత్రలు బాగున్నాయి. బోట్ రేసింగ్ సన్నివేశాల్ని విలక్షణంగా తెరకెక్కించారు. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సుధీర్‌బాబు నటన, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు సందేశం అందరికీ చేరువవుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది’ అని తెలిపారు. మహేష్‌బాబు ప్రశంసల పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తంచేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

