Erracheera | ‘ఎర్రచీర’ విడుదల తేదీ ఖరారు! ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు!
Erracheera | మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఎర్రచీర' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Erracheera | మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఎర్రచీర’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ఒక ముఖ్యపాత్రలో నటించారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో నటించడం విశేషం. సినిమాలో హారర్ సన్నివేశాలు అధికంగా ఉండటం వలన, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, “గుండె జబ్బులు ఉన్న ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి” అని ప్రత్యేకంగా సూచించారు. సినిమాలోని సౌండింగ్ మరియు విజువలైజేషన్ అనుభూతి పూర్తిగా తెలియాలంటే, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని ఆయన తెలిపారు.
నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ, “డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్‌తో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 6న మేము ప్రేక్షకులను పలకరించబోతున్నాం. ముఖ్యంగా, చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తాయి” అని తెలిపారు.
ప్రధాన తారాగణం:
బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: బేబీ డమరి
నిర్మాతలు: ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్), సి.హెచ్. సుమన్ బాబు
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సుమన్ బాబు
సినిమాటోగ్రఫీ: చందు
మ్యూజిక్: ప్రమోద్ పులిగార్ల
బీజీఎం: ఎస్ చిన్న
ఎడిటర్: వెంకట ప్రభు
స్టంట్స్: నందు
సౌండ్ ఎఫెక్ట్స్: ప్రదీప్
పిఆర్ఓ: సురేష్ కొండేటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

