SK 33 | ‘శంబాల’ దర్శకుడితో సందీప్ కిషన్ సరికొత్త ఫాంటసీ అడ్వెంచర్.!
Sundeep Kishan | యువ కథానాయకుడు సందీప్ కిషన్ తన కెరీర్లో మరో మైలురాయి లాంటి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవలే 'శంబాల' చిత్రంతో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు యుగంధర్ ముని ఇప్పుడు అదే స్థాయి భారీ కాన్సెప్ట్‌తో సందీప్ కిషన్‌ను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.
Sundeep Kishan | యువ కథానాయకుడు సందీప్ కిషన్ తన కెరీర్లో మరో మైలురాయి లాంటి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవలే ‘శంబాల’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు యుగంధర్ ముని ఇప్పుడు అదే స్థాయి భారీ కాన్సెప్ట్‌తో సందీప్ కిషన్‌ను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ ఫాంటసీ అడ్వెంచర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. కొన్ని యుద్ధాలు ముగియవు.. కొంతమంది రాజులు మరణించరు (Some wars never end.. Some kings never die) అనే పవర్ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే, ఇది ఒక గొప్ప చారిత్రక లేదా పురాణ సంబంధిత నేపథ్యం ఉన్న ఎపిక్ సాగా అని స్పష్టమవుతోంది. రాజశేఖర్ అన్నభిమోజు మరియు మహిధర్ రెడ్డి సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సందీప్ కిషన్ కెరీర్లో 33వ చిత్రంగా (SK33) రాబోతున్న ఈ ప్రాజెక్ట్, ఆయన మునుపటి సినిమాల కంటే భిన్నమైన మేకోవర్‌లో ఉండబోతోందని సమాచారం. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దనున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్, ఈ ఎపిక్ సాగాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకోనున్నారు.
🔥 From the Blockbuster Makers of Shambhala 🔥
Starring @SundeepKishan 💥@ShiningPictures #ProductionNo3
A @ugandharmuni Fantasy Adventure ✨
⚔️ SOME WARS NEVER END
👑 SOME KINGS NEVER DIETelugu | Hindi | Tamil
Produced by#RajasekharAnnabhimoju #MahidharReddy… pic.twitter.com/RiP1fTuFna
— BA Raju’s Team (@baraju_SuperHit) March 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

