Farah Khan Glimpse | డైరెక్టర్ ఫరాఖాన్ ఇటీవల తన రాజస్థాన్ సెలవుల కోసం రాజస్థాన్ వెళ్లారు. అక్కడ ఆమెకు స్వాగతం పలికేందుకు చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగకుండా ఇలాంటి పనులకు బిల్లెవరు కడతారయ్యా బాబూ? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామం రీల్స్‌లో ఫరా ఖాన్ పంచుకున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల రాజస్థాన్ పర్యాటక నగరం జైపూర్ వెళ్లారు. అక్కడ ఆమె రాంభాగ్ ప్యాలేస్‌లో దిగారు. అయితే, ఆమె హోటల్లోకి వెళ్లగానే మొత్తం ఖాళీగా కనిపించింది. కాస్తా ముందుకు వెళ్లగానే తనకు స్వాగతం పలికేందుకు నిల్చున్న సిబ్బంది కనిపించారు. సిబ్బంది అంతా చేతులు జోడించి వినయంగా నమస్తే అంటూ ఫరా ఖాన్‌ను స్వాగతించారు. వారికి ప్రతినమస్కారం చేస్తూ ఆమె ముందుకు కదిలారు. అయితే, హోటల్ డైనింగ్ హాల్ ఖాళీగా కనిపించడంతో.. ఇవాళ ఎందుకిలా హాల్ ఖాళీగా కనిపిస్తుందని వారిని ప్రశ్నించారు. దాంతో మీరు వస్తున్నందున స్వాగతం చెప్పేందుకు ఇలా సిబ్బంది అంతా వరుసలో నిలబడ్డామని వినమ్రంగా చెప్పారు. ఇది పూర్తిగా మీ కోసమే ఇలా చేశామని, హోటల్ డైనింగ్ మొత్తం మీ కోసమే కేటాయించామని సిబ్బంది చెప్పారు. దాంతో ఆశ్చర్యపోయిన ఫరా ఖాన్.. ఇలా హాల్ అంతా తనకోసమే తెరిచి ఉంచారా? మరి బిల్లెవరు కడతారయ్యా బాబూ? అని తన ఫన్నీ స్టైల్లో వారిని ప్రశ్నించడంతో అక్కడ నవ్వులు విరిసాయి.
ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ఫరా ఖాన్ ముందుంటారు. జైపూర్‌లో తన అనుభవాల గ్లింప్స్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ వేదికపై రీల్స్‌గా పోస్ట్ చేసింది. ఇది తనకు జైపూర్ హోటల్లో దొరికిన ఆతిథ్యం. తన కోసం రెస్టారెంట్‌ను తెరవడం పట్ల ధన్యవాదాలు అని వీడియో కింద కాప్షన్ రాశారు. దీనిపై ఫరా అభిమానులు తమ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తూ మరింత ఆనందం తెప్పించారు. వీవీఐపీ ట్రీట్మెంట్ అందరికీ రాదు.. ఆనందించడానికి బదులుగా భయపడుతున్నారెందుకు అని ఒకరు ప్రశ్నించగా.. హహహ మీరు కూడా అంతే అద్భుతంగా, ఫన్నీగా ఉన్నారని రాశారు.