Ante Sundaraniki | నాని అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్.. ‘ఎంత చిత్రం’ ప్రోమో విడుదల!
Ante Sundaraniki | విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. రొటీన్ భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను అలరిస్తుంది.
తాజాగా ఈ చిత్రంలో ‘ఎంత చిత్రం’ అంటూ సాగే మెలోడి సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోసాంగ్‌ను మే 9 సాయంత్రం 6.03కు విడుదల కానుంది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ‘ది పంచకట్టు’ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nani
- Nazriya Fahad
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

