Vishal-arya enemy movie on OTT |తమిళ స్టార్స్ విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎనిమీ. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, మృణాళని రవి హీరోయిన్లుగా నటించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. తెలుగులో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం 2.95 కోట్ల షేర్‌ను వసూళు చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో ఫిబ్రవరి 18నుండి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రకాష్‌రాజ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.వినోద్ కుమార్ నిర్మించాడు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ సీ.ఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.