‘సేక్రేడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది హాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ. నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన ‘డెవిల్’ చిత్రంలో ఈ భామ ప్రత్యేక గీతంలో మెరిసింది. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఎల్నాజ్ నోరౌజీ మాట్లాడుతూ ‘నేను ఇరాన్లో పుట్టి, జర్మనీలో పెరిగాను. అయినా భారతీయ సంస్కృతి, కళలు అంటే చాలా ఇష్టం. అందుకే బాలీవుడ్లో నటించాలనుకున్నా. కొన్నేండ్లుగా భారత్‌లో ఉంటున్నాను.
ఇప్పుడు ఈ దేశం నా సొంత ఇంటిలా మారింది. ‘డెవిల్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలు కుటుంబ సంప్రదాయాలకు చాలా విలువిస్తారు. స్పెషల్ సాంగ్ కోసం చాలా హోమ్‌వర్క్ చేశాను. ముఖ్యంగా కాస్ట్యూమ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. కల్యాణ్‌రామ్ కూడా డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేశారు. ఇకపై తెలుగు సినిమాలకు కూడా ప్రాధాన్యతనిస్తా. ‘డెవిల్’ విజయం మంచి అవకాశాలు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీతో ‘సంగీన్’ అనే థ్రిల్లర్‌లో నటిస్తున్నా. ‘రాణీతి’ అనే సిరీస్‌లో కూడా కూడా నటిస్తున్నా’ అని చెప్పింది.