Eagle Movie | ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద గట్టిపోటీ వుండబోతుంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, నాగార్జున ‘నా సామిరంగ’ తో పాటు పాటు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ మూవీ హనుమాన్ .. ఇప్పటివరకూ సంక్రాంతి బెర్త్ ని ఖరారు చేసుకున్నాయి. అయితే ఇందులో రవితేజ ఈగల్ చిత్రం సంక్రాంతి బరిలో దిగడం లేదని ప్రచారం జరుగుతుంది.
జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావడం లేదని, ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వుందని, సంక్రాంతికి అందుకోలేకపోచ్చని కథనాలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంపై ఈగల్ టీం క్లారిటీ ఇచ్చింది. ” అవన్నీ రూమర్స్. ముందుగా అనుకున్న తేదీకే సినిమా విడుదలవుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు” అని టీం స్పష్టం చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్స్. ఈ చిత్రాన్ని టి. జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.