సరికొత్త గెటప్‌లో కనిపిస్తాను
‘ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను.ఈ లుక్ తీసుకురావడానికి మూడు నెలలు పట్టింది. ఫస్ట్‌టైం సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నా.
‘ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను.ఈ లుక్ తీసుకురావడానికి మూడు నెలలు పట్టింది. ఫస్ట్‌టైం సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నా. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతుంది’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
రవితేజ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ బాగుంటుంది. పీపుల్ మీడియా నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. ఈ బ్యానర్లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే’ అన్నారు. దాదాపు 300 మంది టీమ్ ఈ సినిమా కోసం పనిచేశారని, ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని దర్శకుడు తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘రవితేజతో మా సంస్థకిది మూడో సినిమా. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్‌తో పాటు చక్కటి సందేశం ఉంటుంది’ అన్నారు. ఈ సినిమాలో తన పాత్రను తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

