DyCM Pawan Kalyan | కోటి రూపాయలు అయిన ఇస్తాను కానీ నా పుస్తకాలు ఇవ్వను : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
DyCM Pawan Kalyan | విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు.
DyCM Pawan Kalyan | విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్ బుక్ లింక్స్ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్ ఫెస్టివల్ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి.
అయితే ఈ బుక్ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోటి రూపాయలు అయిన ఇవ్వడానికి వెనుకాడను కానీ నా దగ్గర పుస్తకాలు ఉన్న ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లే అని నాకు అనిపిస్తుంది. కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధ పడుతాడో తెలీదు కానీ.. నా పుస్తకం ఇవ్వాలంటే కింద, మీద పడిపోతాను అంత మమకారం పుస్తకాలు అంటే అని పవన్ చెప్పుకోచ్చాడు. పుస్తక పఠనం లేకపోతే నేను ఏలా ఉండేవాడినో అనిపిస్తది. నేను ఇంటర్ కూడా ఎందుకు ఆపేశాను అంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో, క్లాస్ రూంలో లేదు అందుకే ఇంటర్ ఆపేశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు.. నేను ఠాగూర్ గారి ప్రేరణతో ఆయన లాగే చెట్లు, మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకొని ఉండిపోయాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకోచ్చాడు.
కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను
పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినటే,
కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధ పడుతాడో తెలీదు కాని.. నా పుస్తకం ఇవ్వాలంటే కింద, మీద పడిపోతాను
ఇంటర్ చదువుకోలేక నేను ఆపలేదు.. నేను కోరుకుంటున్న చదువు… pic.twitter.com/PrlxdlyGJw
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

