Duvvada Madhuri | ‘చీన్ టపాక్ డుం డుం’ అనే వినూత్నమైన టైటిల్‌తో ఓ కొత్త తెలుగు సినిమా ప్రారంభమైంది. ‘శుభం’ సినిమా, ‘కుమారి శ్రీమతి’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గవిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా ఉండనుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కు నటి సమంత క్లాప్ కొట్టగా, దర్శకుడు గోపిచంద్ మలినేని తొలి షాట్‌ను డైరెక్ట్ చేశారు. మల్లిడి వశిష్ట కెమెరా ఆన్ చేయగా, నందిని రెడ్డి, బీవీఎస్ రవి, గౌతమి కలిసి స్క్రిప్ట్‌ను అందించి చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని శ్రీను నాగులపల్లి ‘విలేజ్ టాకీస్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆయనకు నిర్మాతగా తొలి సినిమా కావడం విశేషం. సినిమాకు వై.ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా బ్రిగిడా సాగా నటిస్తుండగా, దువ్వాడ మాధురి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని పీఆర్ మ్యూజిక్ అందిస్తుండగా, పాటలను తిరుపతి జావానా రాస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్ కె, నాగ్ ట్రైల్బ్లేజర్, ఏకలవ్య కలిసి సిద్ధం చేశారు.
ఇప్పటికే నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. వినోదభరితమైన కథ, నవ్వులు పంచే సన్నివేశాలతో ‘చీన్ టపాక్ డుం డుం’ ప్రేక్షకులను అలరించనుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా, దువ్వాడ మాధురి ప్రయాణం ఎప్పుడూ చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. క్లాసికల్ డ్యాన్సర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన ఆమె, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న సంబంధం కారణంగా విస్తృతంగా వార్తల్లో నిలిచారు. గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, తన ప్రత్యేక శైలితో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.ఇటీవల తిరుమలలో రీల్స్ చేయడం, కేక్ కట్ చేయడం వంటి ఘటనలతో ఆమెపై కేసులు నమోదవడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఇలా వరుస వివాదాలు, వార్తల మధ్య నిలిచిన మాధురి ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ల