Dunki Movie | రాష్ట్రపతి భవన్లో ‘డంకీ’ స్పెషల్ స్క్రీనింగ్.. అరుదైన గౌరవం దక్కించుకున్న షారుఖ్.!
Dunki Movie | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది హ్యట్రిక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న షారుఖ్ తాజాగా డంకీ సినిమాతో హ్యట్రిక్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో ప్రస్తుతం రన్ అవుతుంది.
Rashtrapati Bhavan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది హ్యట్రిక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న షారుఖ్ తాజాగా డంకీ సినిమాతో హ్యట్రిక్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో ప్రస్తుతం రన్ అవుతుంది. మొదటిరోజు ఈ సినిమా కలెక్షన్స్ యావరేజ్‌గానే ఉండగా.. మెల్లిమెల్లిగా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.157 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రం ఓ ప్రతిష్టాత్మక వేదికపై స్క్రీనింగ్ అయ్యింది. ఈ మూవీని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్లో అక్కడి సిబ్బందికి ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసి చూపించనున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసిన షారుక్ ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

