Dunki Movie | హృదయాన్ని హత్తుకునేలా ‘డంకీ’ మూవీ నుంచి ‘నిక్లే ది కభీ హమ్ ఘర్ సే’ సాంగ్
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘డంకీ’ (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే(PK), సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘డంకీ’ (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే(PK), సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే.. 17 రోజుల్లో రూ.422 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇదిలావుంటే.. ఈ సినిమా నుంచి నిక్లే ది కభీ హమ్ ఘర్ సే (Nikle The Kabhi Hum Ghar Se) అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. నిక్లే ది కభీ హమ్ ఘర్ సే.. ఘర్ దిల్ సే మగర్ నహీ నిక్లా.. ఘర్ బాసా హై హర్ ధడకన్ మే.. క్యా కరీన్ హమ్ ఐసే దిల్ కా ? (మేము ఇంట్లో నుంచి ఎప్పుడో బయటకి వచ్చాము కానీ.. ఇల్లు మా మనసులోనే ఉంది. ప్రతి గుండె చప్పుడులో ఇల్లు కొలువై ఉంది అలాంటి మనసుని ఏం చెయ్యాలి) అంటూ హృదయాలను హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాట చూస్తే.. అక్రమంగా ఇంగ్లాండ్ వెళ్లడానికి షారుఖ్ అండ్ గ్యాంగ్ ఎలాంటి ప్రయాత్నాలు చేశారు అనేది పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు జావేద్ అక్తర్ సాహిత్యం అందించగా.. సోను నిగమ్ పాడాడు. ప్రీతమ్ సంగీతం అందించాడు.
ఇక డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మించారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

