ముంబై: ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే ఇవాళ కన్నుమూశారు. ఆ సింగర్ పాడిన దమ్ మారో దమ్( Dum Maro Dum) సాంగ్ ఓ సూపర్‌హిట్. హిప్ కల్చర్‌ను ప్రజెంట్ చేసిన సాంగ్ అది. ఆ రోజుల్లో ఈ పాట ఓ బంపర్ హిట్. డ్రగ్ కల్చర్‌ను.. ఆ నాటికి తగ్గ రీతిలో ఈ ఫిల్మ్‌లో చూపించారు. 1971లో రిలీజైన హరే కృష్ణ హరే రామ్ చిత్రంలో ఓ సన్నివేశంలో దమ్ మారో దమ్ సాంగ్ వస్తుంది. జీనత్ అమన్ పాత్ర ఈ సాంగ్ పాడుతుంది. ఆర్డీ బర్మన్ అందించిన సంగీతం ఓ హైలెట్. పాశ్చాత్య సంప్రదాయం వైపు మొగ్గ చూపుతున్న యువతను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆ సాంగ్ సీక్వెన్స్‌ను రూపొందించారు. వాస్తవానికి ఫిల్మ్‌లో ఈ పాట ముందు అనుకోలేదు. కానీ డ్రగ్ సీన్‌ను క్రియేట్ చేసే సమయంలో దాన్ని మరింత ఎఫెక్ట్‌గా ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో రైటర్ ఆనంద్ భక్షీ రాసిన కొన్ని పదాలు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ పాట కట్టేశారు.
ఆ నాటి హిప్పీ కల్చర్‌లో ఉన్న మజాను.. సింగర్ ఆశా భోంస్లే తన వాయిస్‌లో వినిపించారు. మత్తులో చిత్తై తూగుతున్నట్లుగా ఆమె తన స్వరాన్ని పలికించారు. డ్రగ్ బానిసల భావోద్వేగాన్ని ఆశా భోంస్లే తన వాయిస్ రూపంలో అత్యద్భుతంగా ఒలికించారు. నేపాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాటను షూట్ చేశారు. సినిమాను రిలీజ్ చేస్తున్న సమయంలో ఓ దశలో నిర్మాత దేవానంద్ ఈ పాటను సినిమా నుంచి తీసివేయాలనుకున్నారు. కానీ ఈ సాంగ్ హిట్ అవుతుందని ఆశా భోంస్లే చెప్పడం వల్లే దాన్ని ఫిల్మ్‌లో క్యారీ చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
బాలీవుడ్‌తో పాటు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఈ సాంగ్ కిక్కెక్కించిందనడంలో సందేహం లేదు. దమ్ మారో దమ్.. అంటూనే హరే కృష్ణ హరే రామ్ అన్న పదాలను వాడడం పట్ల విమర్శలు వచ్చినా.. మ్యూజిక్ టీమ్ అనుకున్నట్లు ఈ సాంగ్ ఫుల్ పాపులర్ అయ్యింది. కానీ ఆల్ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్లోనూ ఈ పాటపై బ్యాన్ విధించారు. హరే కృష్ణ హరే రామ్ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించిన ప్రతిసారి ఈ పాటను కట్ చేశారు. తాజాగా రిలీజైన సూపర్‌హిట్ మూవీ ధురంధర్2లో ఈసాంగ్‌ను ఓ సీన్లో సౌండ్‌ట్రాక్‌గా వాడారు. సోషల్ మీడియాలోనూ ఈ ట్రాక్ ఊపేస్తోంది.