అసాధారణ ప్రయాణం
‘మహానటి’ ‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్'.
‘మహానటి’ ‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
1980-90 దశకంలో జరిగే ఈ కథలో ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ అసాధార ప్రయాణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందుకోసం 80ల నాటి ముంబయి మహానగరాన్ని హైదరాబాద్‌లో వేసిన సెట్లో రీక్రియేట్ చేశామని, ఆ కాలం నాటి బ్యాంక్‌లను పోలి ఉండే సెట్‌ను కూడా తీర్చిదిద్దామని చిత్ర బృందం పేర్కొంది.
సహజత్వం ఉట్టిపడేలా 1980ల నాటి ముంబయి మహా నగరాన్ని సెట్లో అందంగా పునఃసృష్టించామని దర్శకుడు తెలిపారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

