Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
Dulquer Salmaan | 'మహానటి' (Mahanati) సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘సీతారామం’ (Seetharamam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్ర హీరో.
Dulquer Salmaan | ‘మహానటి’ (Mahanati) సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘సీతారామం’ (Seetharamam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇక గత ఏడాది ‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాతో దుల్కర్ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా అనంతరం దుల్కర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వెంకీ అట్లూరితో దుల్కర్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్’ అంటూ ఈ సినిమా రానుండగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
A first step into the remarkable journey of our #LuckyBaskhar, begins tomorrow at 04:41pm! #LuckyBaskharFirstLook ✨#LuckyBaskhar #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/knOtwpww5C
— Dulquer Salmaan (@dulQuer) February 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

