మళ్లీ పుట్టే ప్రేమ ‘శ్రీశ్రీ’
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో వరుసగా వందకోట్ల విజయాలను తెలుగులో అందుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. మరో స్ట్రయిట్ ప్రేమకథతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో వరుసగా వందకోట్ల విజయాలను తెలుగులో అందుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. మరో స్ట్రయిట్ ప్రేమకథతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నెలకుదితి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. పూజా హెగ్డే కథానాయిక. శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. శుక్రవారం నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘శ్రీశ్రీ’ అనే ఆహ్లాదకరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. ‘లవ్ విల్ స్పార్క్ అగైన్’ అనేది ఉపశీర్షిక. కాంపౌండ్ వాల్‌పై కూర్చుని సరదాగా కబుర్లాడుకుంటున్న దుల్కర్ సల్మాన్, పూజాహెగ్డేలను ఈ పోస్టర్లో చూడొచ్చు. బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో చిరునవ్వులు చిందిస్తూ దుల్కర్ కనిపిస్తే, లైట్ బ్లూ సల్వార్ సూట్లో అతని వైపు చూసి మనసారా నవ్వుతూ పూజా హెగ్డే కనిపిస్తున్నది. ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని పోస్టర్ చెబుతున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ప్రేమకథకి కెమెరా: అనయ్ ఓం గోస్వామి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, సహనిర్మాత: ఇషాన్ సక్సేనా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

