Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తారక్.. తాజాగా తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ చిత్రీకరణలో అక్టోబర్ 15న ఎన్టీఆర్ అడుగుపెట్టినట్లు సమాచారం.
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తారక్.. తాజాగా తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ చిత్రీకరణలో అక్టోబర్ 15న ఎన్టీఆర్ అడుగుపెట్టినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ వేగం పుంజుకోనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో ఆయన పాల్గొనాల్సిన సన్నివేశాల చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే షూటింగ్ పూర్తిగా ఆగిపోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్, చిత్ర బృందం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు.
తాజాగా ఎన్టీఆర్ కోలుకుని తిరిగి సెట్స్‌లోకి రావడంతో మిగిలిన చిత్రీకరణను వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ పూర్తయ్యే వరకు తారక్ వరుస షెడ్యూళ్లలో పాల్గొననున్నారని సమాచారం. మొదట ‘డ్రాగన్’ చిత్రాన్ని 2026 జూన్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల ప్రణాళికలో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2027 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే 2027 ఫిబ్రవరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే చిత్రీకరణ, విడుదల తేదీలపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో తనదైన శైలిని చాటుకున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో ఎలాంటి కథను తెరకెక్కిస్తున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన పాత్రలో తారక్ కనిపించనున్నారనే అంచనాలతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

