Double iSmart | ఇస్మార్ట్ రామ్‌తో ఛార్మీ కౌర్ సెల్ఫీ.. డబుల్ ఇస్మార్ట్ క్రేజీ అప్డేట్
Double iSmart | రామ్ (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ షురూ అయినట్టు తెలియజేస్తూ.. రామ్‌పై ఉస్తాద్ స్టైల్లో వ్యాన్‌లో వచ్చే సీన్ స్టిల్ షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ ఇటీవలే గ్రాండ్‌గా షురూ అయింది. ఇప్పటికే హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ షురూ అయినట్టు తెలియజేస్తూ.. రామ్‌పై ఉస్తాద్ స్టైల్లో వ్యాన్‌లో వచ్చే సీన్ స్టిల్ షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా రామ్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసుకుంటూ.. మొదటి యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడిక మరో క్రేజీ షూట్ కోసం ఇండియా దాటే సమయం వచ్చేసింది.. అంటూ ట్వీట్ చేసింది ఛార్మీ కౌర్ (Charmme Kaur). ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 మార్చి 8న విడుదల చేస్తున్నట్టు పూరీ కనెక్ట్స్ బ్యానర్ మరోసారి తెలియజేసింది.
ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అని ట్వీట్ చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్లో మంటలు కనిపిస్తున్న లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పూరీ ఫస్ట్ పార్టును మించి డబుల్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలో ఉండబోతున్నట్టు టైటిల్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పూరీ ఇస్మార్ట్ శంకర్‌ను బీట్ చేసేలా డబుల్ ఇస్మార్ట్ ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేసినట్టు.. షూటింగ్ లాంఛ్ సందర్భంగా షేర్ చేసిన ఫొటోతో అర్థమవుతుందంటున్నారు మూవీ లవర్స్, నెటిజన్లు.
రామ్‌తో ఛార్మీ కౌర్ సెల్ఫీ..
Successfully completed our 1st action-packed schedule and now time to fly out of India for our yet another maaddd crazy shoot 😀#DoubleISMART
IN CINEMAS MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/CVlAff4TiK
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2023
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

