చిత్రలహరి నేపథ్యంలో అందమైన ప్రేమకథ
90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చే చిత్రలహరి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి టైమ్ పీరియడ్ మిస్ అయిన వారికి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది.
90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చే చిత్రలహరి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి టైమ్ పీరియడ్ మిస్ అయిన వారికి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ రోజుల్లో చిత్రలహరి కోసం అందరూ ఎలా ఎదురుచూసేవారు? చిత్రలహరి అనేది గ్యాదరింగ్ పాయింట్లా ఎలా ఉండేది? అనేది ఇందులో ఆసక్తికరంగా చూపించాం.
ఈ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇందులో ప్రేమ మాత్రమే ఉండదు. యువతకు, తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చే అంశాలు కూడా ఉంటాయి’ అన్నారు దర్శకుడు కార్తికేయ కొమ్మి. ఆయన దర్శకత్వంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఎమోషనల్ పీరియాడిక్ ప్రేమకథ ‘దూరదర్శిని’. ‘కలిపింది ఇద్దరినీ’ అనేది ఉపశీర్షిక.
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించారు. జయశంకర్‌రెడ్డి ఎం., పాటిమీద సంతోష్ నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు కార్తికేయ కొమ్మి విలేకరులతో ముచ్చటించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పెద్దాయన ప్రస్తుతం అరుణాచలంలో బిక్షాటన చేస్తున్నారు. ఆయన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశాం.
సొంత కొడుకు వల్లే ఆయనకు బిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదెలా అనేది ఇందులో చూపించాం. పతాక సన్నివేశాలు అందర్నీ ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన కాసేపటివరకూ ఆ ఫీల్ వదిలివెళ్లదు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే రియలిస్టిక్ లవ్‌స్టోరీ ఇది’ అని కార్తికేయ కొమ్మి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

