Don-3 Movie | డాన్-3 అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్.. ఒక్క మాటలో గూస్బంప్స్ అంతే..!
Ranveer Singh | బాలీవుడ్లో డాన్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పదిహేడేళ్ల కిందట ఈ సిరీస్‌లో వచ్చిన తొలి పార్టు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి హిందీనాట సరికొత్త రికార్డులు సృష్టించింది.
Ranveer Singh | బాలీవుడ్లో డాన్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పదిహేడేళ్ల కిందట ఈ సిరీస్‌లో వచ్చిన తొలి పార్టు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి హిందీనాట సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాకైన బడ్జెట్ ఆక్షరాల రూ.38 కోట్లు. ఇప్పుడంటే ఈ నెంబర్ చిన్నదిగా అనిపస్తుంది కానీ.. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ విని అన్ని ఇండస్ట్రీలు షాక్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ఐదేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. డాన్-2:ది కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఈ సినిమా షారుఖ్‌ను రెండొందల కోట్ల క్లబ్లో చేర్చింది. ఈ రెండు సినిమాలకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించాడు.
ఇక తాజాగా ఈ సిరీస్‌లో మూడో ఇన్స్టాల్లేషన్గా డాన్-3ను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సారి డాన్‌గా రణ్వీర్ సింగ్‌ను చూపించబోతున్నాడు. కొత్త శకం ప్రారంభం అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో రణ్వీర్ డాన్ మేకోవర్‌ను చూపించారు. లైటర్‌తో సిగర్ వెలిగించుకుంటూ డాన్ అని చెప్పడం గ్లింప్స్‌కే హైలేట్లా నిలిచింది. ఫర్హాన్ దాదాపు పుష్కర కాలం తర్వాత మెగా ఫోన్ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరి కల్లా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారట. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేసి 2025లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రితేష్ సిద్వాని, ఫర్హన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది.
A New Era Begins #Don3 @RanveerOfficial #JasonWest @javedakhtarjadu @ritesh_sid @ShankarEhsanLoy @PushkarGayatri @j10kassim @roo_cha @vishalrr @excelmovies @rupinsuchak @chouhanmanoj82 pic.twitter.com/i1hHrl6fuo
— Farhan Akhtar (@FarOutAkhtar) August 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

